Jagan: జగన్ ను ప్రశ్నించేందుకు సిటీ న్యూరో సెంటర్ కు వచ్చిన ఏపీ సిట్!

  • దాడి ఘటనపై వివరాలు సేకరించేందుకే
  • సమయం కావాలని జగన్ వ్యక్తిగత సిబ్బందికి సమాచారం
  • వైద్య నివేదిక తరువాతేనన్న ఆసుపత్రి అధికారులు

నిన్న జరిగిన దాడి ఘటనపై జగన్ ను ప్రశ్నించి, మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఏపీ సిట్ అధికారుల బృందం సిటీ న్యూరో సెంటర్ సిటీ ఆసుపత్రికి చేరుకుంది. తమకు కొంత సమయం కావాలని జగన్ వ్యక్తిగత సిబ్బందికి చెప్పిన అధికారులు, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యులను అడిగి సమాచారం తెలుసుకున్నారు.

జగన్ పై దాడి కేసులో వాంగ్మూలం తీసుకునేందుకు ఏపీ అధికారుల బృందం ఈ ఉదయం హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, జగన్ హెల్త్ రిపోర్టు తయారవుతోందని, అది వచ్చిన తరువాత, జగన్ ను కలుసుకోవచ్చని సిట్ అధికారులకు ఆసుపత్రి అధికారులు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

Jagan
SIT
City Nuro
  • Loading...

More Telugu News