Amaravati: అమరావతిలో వైకాపా ఆందోళన... సీఎం నివాసం వద్ద భద్రత పెంపు!

  • నేడు రెండో రోజు కలెక్టర్ల సదస్సు
  • శాంతిభద్రతలపై కీలకచర్చ
  • నిఘా వర్గాల హెచ్చరికలతో భద్రత కట్టుదిట్టం

నిన్న తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ పై జరిగిన దాడిని నిరసిస్తూ, ఈ ఉదయం అమరావతి ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరసనలకు దిగిన వేళ, ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసం వద్ద భద్రతను పెంచారు. నేడు రెండో రోజు కలెక్టర్ల సదస్సు జరగనుండగా, శాంతిభద్రతలపై కీలక చర్చ జరగనుంది. ఇప్పటికే సీఎం నివాసానికి డీజీపీ ఆర్పీ ఠాకూర్, అన్ని జిల్లాల ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు చేరుకున్నారు.

 ఈ నేపథ్యంలో వైకాపా కార్యకర్తలు సీఎం నివాసం వైపు దూసుకు రావచ్చన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతను కట్టుదిట్టం చేసినట్టు తెలుస్తోంది. అమరావతి, విజయవాడ ప్రాంతాల నుంచి సీఎం నివాసానికి చేరుకునే మార్గంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. కాగా, నేడు శాంతిభద్రతలతో పాటు ఐటీ, పర్యాటకం, రెవెన్యూ తదితర శాఖలపైనా సమీక్ష జరగనుంది.

Amaravati
Chandrababu
Collectors Conference
YSRCP
  • Loading...

More Telugu News