Anup Jalota: తలపై ఏడువేల వెంట్రుకలను నాటించుకోవడం కోసం రూ.7 లక్షలు ఖర్చుచేశా: సింగర్ అనూప్ జలోటా

  • ముందువైపు జుట్టంతా ఊడిపోయింది
  • ఒక్కో వెంట్రుక కోసం రూ.100 ఖర్చు చేశా
  • గడ్డంలోని వెంట్రుకలను కూడా తీసుకున్నారు

తానెందుకు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాల్సి వచ్చిందీ బాలీవుడ్ సింగర్, బిగ్‌బాస్-12 పోటీదారు అనూప్ జలోటా వెల్లడించాడు. నెత్తిపై ముందున ఉన్న వెంట్రుకలన్నీ ఊడిపోయాయని, దీంతో ట్రాన్స్‌ప్లాంట్‌కు వెళ్లడం తప్ప మరోమార్గం లేకుండా పోయిందన్నాడు. ఏడువేల వెంట్రుకల కోసం ఏడు లక్షల రూపాయలు ఖర్చు చేశానని వివరించాడు. అంటే ఒక్కో వెంట్రుకకు వంద రూపాయలు ఖర్చు చేశానన్నాడు. అయితే, చాలామంది ఒక్కో వెంట్రుకకు రూ.50 మాత్రమే ఖర్చు చేశారని, తాను మరో రూ.50 అధికంగా ఖర్చు చేశానని పేర్కొన్నాడు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ కోసం తన గడ్డంలోని వెంట్రుకలను కూడా తీసుకున్నారని జలోటా వివరించాడు.

Anup Jalota
hair strands
Hair transplant
Big Boss
Bollywood
Singer
  • Loading...

More Telugu News