Rakhi Sawant: తనుశ్రీవి అన్నీ మగ బుద్ధులే.. రాఖీసావంత్ సంచలన వ్యాఖ్యలు!

  • తనుశ్రీ పేరుకే ఆడది.. బుద్ధులన్నీ మగాళ్లవే
  • డ్రగ్స్ తీసుకోమని బలవంతం చేసింది
  • ఇండస్ట్రీలో చాలామంది లెస్బియన్లు ఉన్నారు

బాలీవుడ్ నటి రాఖీసావంత్ మరోమారు సంచలన ఆరోపణలు చేసింది. ‘మీటూ’ ఉద్యమంతో ప్రకంపనలు సృష్టించిన నటి తనుశ్రీ దత్తా పుష్కరకాలం క్రితం తనపై పలుమార్లు అత్యాచారం చేసిందని పేర్కొని రాఖీ సావంత్ కలకలం రేపింది. ఈ విషయాన్ని చెప్పడానికి తాను చాలా ఇబ్బంది పడుతున్నానని చెప్పిన రాఖీ.. ఓ అమ్మాయిని మరో అమ్మాయి రేప్ చేయడమేంటని అనుకోవద్దని పేర్కొంది. ఇప్పుడందరి దృష్టి మీటూపైనే ఉందని, ఇప్పుడు 'షీటూ' ఉద్యమం కూడా రావాల్సిన అవసరం ఉందని విలేకరులతో చెప్పుకొచ్చింది.  

తన జీవితంలో జరిగిన అసభ్యకరమైన సంఘటన గురించి చెప్పడానికి తాను సిగ్గుపడుతున్నానన్న రాఖీ.. ఈ విషయంలో ఓ అమ్మాయిగా రేప్ అనే పదాన్ని ఎంతవరకు వాడొచ్చో తనకు తెలియదని పేర్కొంది. తనుశ్రీ చూడడానికి అమ్మాయే అయినా, అన్నీ మగ బుద్ధులేనని పేర్కొంది. తనుశ్రీ 12 ఏళ్ల క్రితం తన బెస్ట్ ఫ్రెండ్ అని, తనను డ్రగ్స్ తీసుకోమని బలవంతం చేసేదని ఆరోపించింది. అప్పట్లో పేర్లు బయటపెట్టడానికి చాలా భయపడ్డానని, రేప్ చేస్తామని, చంపేస్తామని బెదిరింపులు వచ్చాయని తెలిపింది.  

తాను తనుశ్రీపై చేస్తున్న ఆరోపణలకు సంబంధించి సాక్ష్యాలు ఉన్నాయని రాఖీ వివరించింది. తనుశ్రీ లాంటి లెస్బియన్లు ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారని పేర్కొన్న రాఖీ.. వారి పేర్లను బయటపెట్టబోనని పేర్కొంది. తనుశ్రీ తన శరీరంపై ఎక్కడెక్కడ చేతులు వేసిందీ కోర్టులోనే చెబుతానని రాఖీ స్పష్టం చేసింది.

Rakhi Sawant
Bollywood
Tanushree datta
Me too
Rape
  • Loading...

More Telugu News