Vanka satyanarayana: మాజీ ఎమ్మెల్యే వంక సత్యనారాయణ కన్నుమూత

  • తణుకులో స్వగృహంలో మృతి చెందిన సత్యనారాయణ
  • 1942లో సీపీఐలో చేరిక
  • తుదకంటా ఆ పార్టీలోనే

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ ఎమ్మెల్యే వంక సత్యనారాయణ (95) మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. 1942లో సీపీఐలో చేరిన సత్యనారాయణ చివరి వరకు అదే పార్టీలో కొనసాగారు. పెనుగొండ నియోజకవర్గం నుంచి 1962, 1972, 1994లలో మూడుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. సత్యనారాయణకు భార్య నాగమణి, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నాగమణి మహిళా సమాఖ్య నాయకురాలిగా ఉన్నారు.

Vanka satyanarayana
CPI
MLA
Tanuku
West Godavari District
  • Loading...

More Telugu News