ys jagan: జగన్ పై సానుభూతి రావడం కోసమే దాడి చేశానన్న నిందితుడు?

  • శ్రీనివాస్ వాంగ్మూలాన్ని రికార్డు చేసిన పోలీసులు
  • జగన్ సీఎం కాకపోవడంతో నిందితుడు మనస్తాపం  
  • దాడి చేస్తే జగన్ పై సానుభూతి పెరుగుతుందని భావించాడట

వైసీపీ అధినేత జగన్ పై దాడికి పాల్పడ్డ నిందితుడు శ్రీనివాస్ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. కాసేపట్లో మీడియాకు ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు తెలియజేయనున్నారు. జగన్ పై సానుభూతి వస్తుందన్న ఉద్దేశంతోనే ఆయనపై తాను దాడికి పాల్పడ్డానని శ్రీనివాస్ చెప్పినట్టు తెలుస్తోంది.

గత ఎన్నికల్లోనే జగన్ విజయం సాధించి ముఖ్యమంత్రి అవ్వాల్సిందని, అలా కాకపోవడం వల్ల తాను మనస్తాపం చెందానని, దాడి చేస్తే ఆయనపై సానుభూతి పెరుగుతుందని భావించే అలా చేశానని శ్రీనివాస్ తెలిపినట్టు సమాచారం. తమ కుటుంబమంతా వైఎస్ అభిమానులమేనని శ్రీనివాస్ తన వాంగ్మూలంలో పేర్కొన్నట్టు తెలుస్తోంది.

ys jagan
Vizag
air port
srinivas
  • Loading...

More Telugu News