Jagan: జగన్ సీఎం కావాలనే కోరికతో.. సానుభూతి కోసం ప్రయత్నించారేమో!: బుట్టా రేణుక

  • జగన్‌పై దాడిని ఖండిస్తున్నాం
  • పాదయాత్రకు భద్రత పెంచాలి
  • వెర్రి అభిమానంతో దాడి చేసి ఉండొచ్చు

ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్‌పై జరిగిన దాడి విషయమై టీడీపీ, వైసీపీల మధ్య మాటల జోరు పెరుగుతోంది. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వ కుట్రేనని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే... వైసీపీ కావాలనే తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

తాజాగా ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ.. జగన్‌పై దాడిని ఖండిస్తున్నామన్నారు. ఇకముందు ఆయన పాదయాత్రకు పటిష్టమైన భద్రత చేపట్టాలన్నారు. జగన్ ముఖ్యమంత్రి కావాలనే కోరికతో సానుభూతి సంపాదించుకోవడం కోసం ప్రయత్నించారేమోననే అనుమానాన్ని ఆమె వ్యక్తం చేశారు. లేదంటే జగన్‌పై వెర్రి అభిమానంతో దాడి చేసి ఉండొచ్చని రేణుక పేర్కొన్నారు.

Jagan
Butta Renuka
YSRCP
Telugudesam
  • Loading...

More Telugu News