kohli: కోహ్లీ 10 వేల పరుగుల రికార్డుపై స్పందించిన అనుష్క

  • కోహ్లీపై తన ప్రేమను చాటుకున్న భార్య అనుష్క
  • ఇన్ స్టాగ్రాం వేదికగా ఓ పోస్ట్
  • ‘వాటే మ్యాన్’ అంటూ అనుష్క పొగడ్త 

విశాఖలో వెస్టిండీస్ తో జరిగిన వన్డేలో అద్భుతమైన సెంచరీతో పది వేల పరుగుల మైలురాయిని వేగవంతంగా చేరుకున్న కోహ్లీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. దీనిపై ఆయన భార్య అనుష్క కూడా స్పందించింది. ఇన్ స్టాగ్రాం వేదికగా ప్రశంసల జల్లు కురిపించింది. హృదయాకారంలో ఉన్న ఎమోజీలు, కిరీటాన్ని పోస్ట్ చేసి ‘వాటే మ్యాన్’ అని క్యాప్ట్స్ ఇస్తూ కోహ్లీపై తన ప్రేమను చాటుకుంది.

ఇదిలావుండగా, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 10 వేల పరుగుల మైలు రాయి అందుకున్న 13వ క్రికెటర్ గా నిలిచాడు. దిగ్గజం సచిన్ టెండూల్కర్ 259 ఇన్నింగ్స్ లలో ఈ రికార్డును అందుకోగా, కోహ్లీ కేవలం 205 ఇన్నింగ్స్ లలోనే చేరుకున్నాడు. అంతేకాకుండా 2018లో కేవలం 11 మ్యాచ్ లు ఆడిన కోహ్లీ 143.43 సగటుతో వెయ్యి పరుగులు పూర్తి చేసి రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News