Kalva Srinivasulu: జగన్ అంత తాపీగా విమానం ఎక్కి హైదరాబాద్ ఎందుకు వెళ్లారు?: మంత్రి కాల్వ

  • కత్తికి విషం ఉండి ఉంటుందన్న అనుమానాలపై ఫైర్
  • విశాఖలోని ఆసుపత్రికి ఎందుకెళ్లలేదో అర్థం కావట్లేదు
  • దాడి రాజకీయ కుట్రగా అనిపిస్తోంది

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడిలో కత్తికి విషం ఉండి ఉంటుందని ఆ పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఫైర్ అయ్యారు. నేడు విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. వైకాపా అధ్యక్షుడు జగన్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు.

ఇక కత్తికి విషం ఉంటుందని అనుమానాలున్నప్పుడు జగన్ అంత తాపీగా విమానం ఎక్కి ఎందుకు హైదరాబాద్‌ వెళ్లారని ఆయన ప్రశ్నించారు. విశాఖలోని ఆసుపత్రికి ఎందుకు వెళ్లలేదో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రంలో ఎవరిపై దాడి జరిగినా తాము సహించేది లేదన్నారు. జగన్‌పై దాడి కేంద్ర భద్రతా సిబ్బంది అధీనంలో ఉండే విమానాశ్రయంలో జరగడాన్ని చూస్తే ఇది రాజకీయ కుట్రగా అనిపిస్తోందన్నారు.

Kalva Srinivasulu
Jagan
YSRCP
Hyderabad
Vizag
  • Loading...

More Telugu News