Kanna Lakshmi Narayana: రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేసే దారుణమైన పరిస్థితి ఏపీలో ఉంది: కన్నా లక్ష్మీనారాయణ

  • జగన్‌పై దాడి విషయమై కన్నా ట్వీట్స్
  • జగన్‌పై దాడిని ఖండిస్తున్నా
  • ప్రభుత్వమే ఈ దాడులకు బాధ్యత వహించాలి

ఎయిర్‌పోర్టులో వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్ ద్వారా స్పందించారు. జగన్‌పై దాడిని ఖండిస్తూ రెండు వరుస ట్వీట్లను ఆయన పోస్ట్ చేశారు. ‘‘రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేసే దారుణమైన పరిస్థితి నేడు ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. జగన్‌పై దాడిని ఖండిస్తున్నాను. ప్రభుత్వమే ఈ దాడులకు బాధ్యత వహించాలి. విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై దాడి, తిరుపతిలో అమిత్ షా గారి వాహనంపై దాడి, రాష్ట్ర పర్యటనలో నాపై దాడి, పవన్‌పై దాడికి కుట్ర ఇవన్నీ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, శాంతిభద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో చెబుతున్నాయి’’ అని ట్వీట్ చేశారు.

Kanna Lakshmi Narayana
Jagan
Amith shah
Pavan
Airport
BJP
  • Loading...

More Telugu News