Chandrababu: సీఎం చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలి.. హిట్లర్ పోకడలు మానాలి: బీజేపీ నేత జీవీఎల్

  • జగన్ పై దాడి అమానుషం..ఏదో కుట్ర ఉంది
  • నిందితుడిని ఎవరు ఏ ఆలోచనతో ప్రేరేపించారో తేలాలి
  • ఓ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

వైసీపీ అధినేత జగన్ పై కత్తితో దాడి జరిగిన ఘటనను బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఖండించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ పై దాడి అమానుషమని, దీని వెనుక ఏదో కుట్ర ఉందని అనుమానించారు. కక్ష ఉంటే తప్ప ఇలాంటి ఘటనలు జరగవని అన్నారు. ఇది పథకం ప్రకారం జరిగిన దాడి అని, దీనిపై నిష్పాక్షిక విచారణ జరగాలని, ఓ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

దాడి చేసిన వ్యక్తిని ఎవరు ఏ ఆలోచనతో ప్రేరేపించారో తేలాలని, తప్పుడు ప్రచారం, అబద్ధాలు ప్రచారం చేయడంతో టీడీపీ నెంబర్ వన్ అని, ఎయిర్ పోర్ట్ లో దాడి చేస్తే తమపైకి రాదని టీడీపీ అనుకున్నట్టుందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలని, హిట్లర్ పోకడలు మానాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హింస ద్వారా ప్రతిపక్షాలను బెదిరించాలని చూస్తే సహించమని జీవీఎల్ హెచ్చరించారు.

Chandrababu
ys jagan
gvl narasimha rao
  • Loading...

More Telugu News