ys jagan: మా నేతకి ఏదైనా జరిగితే ఒక్క టీడీపీ నాయకుడూ బయట తిరిగే పరిస్థితి ఉండదు: వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్

  • జగన్ ని ఎదుర్కొనే శక్తి టీడీపీ నాయకులకు లేదు
  • నపుంసకులుగా వ్యవహరిస్తున్నారు
  • ఈ దాడిని కొన్ని ఛానెళ్లు వక్రీకరించడం సబబు కాదు

మా నేతలకు ఏదైనా జరిగితే ఒక్క టీడీపీ నాయకుడూ బయట తిరిగే పరిస్థితి ఉండదని వైసీపీ నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ హెచ్చరించారు. వైసీపీ అధినేత జగన్ పై కత్తితో దాడి జరిగిన సంఘటనను ఆయన ఖండించారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ జగన్ ని టీడీపీ నాయకులు ఎదుర్కొనే శక్తి లేక నపుంసకులులా వ్యవహరిస్తూ ఈ విధంగా అణచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. జగన్ పై దాడిని కొన్ని ఛానెళ్లు వక్రీకరిస్తూ కథనాలు ప్రసారం చేస్తున్నాయని, ఇది సరైన పద్ధతి కాదని మండిపడ్డారు. ఆ ఛానెళ్ల తీరు మార్చుకోకపోతే తగిన విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

ys jagan
mla anil
Telugudesam
Vizag incident
  • Loading...

More Telugu News