governor: ఏపీ డీజీపీకి ఫోన్ చేసిన గవర్నర్.. పూర్తి నివేదిక పంపించాలంటూ ఆదేశం

  • జగన్ పై దాడి విషయమై ఫోన్ చేసిన గవర్నర్
  • ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలకు తావు లేదన్న జవహర్
  • విచారణ జరిపి, నిజాలను తేలుస్తాం

వైసీపీ అధినేత జగన్ పై ఓ యువకుడు దాడి చేసిన ఘటనపై గవర్నర్ నరసింహన్ స్పందించారు. వార్త తెలిసిన వెంటనే ఏపీ డీజీపీ ఠాకూర్ కు ఫోన్ చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి నివేదికను పంపాలని ఆదేశించారు. మరోవైపు ఈ దాడిని ఏపీ మంత్రి జవహర్ ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలకు తావు లేదని చెప్పారు. కేంద్ర బలగాల అధీనంలో ఉండే ఎయిర్ పోర్టులో దాడి ఎలా జరిగిందన్న దానిపై విచారణ జరిపి, నిజాలను తేలుస్తామని తెలిపారు. 

governor
narasimhan
ap dgp
phone
  • Loading...

More Telugu News