charan: చరణ్ మూవీలో ఐటమ్ సాంగ్ .. రంగంలోకి బాలీవుడ్ బ్యూటీ?

  • షూటింగు దశలో 'వినయ విధేయ రామ'
  • ఐటమ్ సాంగ్ కోసం దేవిశ్రీ ప్రసాద్ కసరత్తు 
  • కీలక పాత్రల్లో ప్రశాంత్.. స్నేహ

బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ కథానాయకుడిగా ఒక యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. ఈ సినిమాకి 'వినయ విధేయ రామ' అనే టైటిల్ ను ఇటీవలే ఖరారు చేశారు. ఈ సినిమాలో చరణ్ సరసన కథానాయికగా కైరా అద్వాని నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. మరో నెల రోజుల్లో షూటింగు పూర్తికానున్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమాలో యూత్ ను .. మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసే ఐటమ్ సాంగ్ ఒకటి వుంటే బాగుంటుందని బోయపాటి భావించి, దేవిశ్రీ ప్రసాద్ కి చెప్పాడట. దాంతో ఆయన ఐటమ్ సాంగ్ కి ట్యూన్ చేసే పనిలో బిజీగా వున్నాడని అంటున్నారు. అయితే ఈ ఐటమ్ సాంగ్ కోసం ఏ హీరోయిన్ ను రంగంలోకి దింపితే బాగుంటుందా అని ఆలోచన చేసిన టీమ్, బాలీవుడ్ హీరోయిన్ అయితేనే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ బాలీవుడ్ బ్యూటీ పేరును త్వరలోనే ప్రకటించనున్నారు. వివేక్ ఒబెరాయ్ విలన్ గా చేస్తోన్న ఈ సినిమాలో, స్నేహ .. ప్రశాంత్ కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు.      

charan
kiara adwani
  • Loading...

More Telugu News