TGS: నన్ను షాడో బృందాలు వెంటాడుతున్నాయి!: టీజేఎస్‌ అధినేత కోదండరాం ఆరోపణ

  • నా ఫోన్‌ కాల్స్‌ ట్యాప్‌ చేస్తున్నారు
  • నా వాట్సాప్‌ కాల్స్‌ను గమనిస్తున్నారు
  • ఇంటెలిజెన్స్‌ అధికారులే ఈ సమాచారం ఇచ్చారు

కొద్దికాలం నుంచి తనను షాడో బృందాలు వెన్నంటి నడుస్తున్నాయని, తన కదలికలన్నీ పసిగడుతున్నాయని టీజేఎస్‌ అధినేత కోదండరాం ఆరోపించారు. గురువారం జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. 'నా ఫోన్‌ కాల్స్‌, నా వాట్సాప్‌ కాల్స్‌ ట్యాప్‌ చేసి నా సంభాషణలు వింటున్నారు' అంటూ ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్‌ అధికారులే తనకు చెప్పారని తెలిపారు. పోలీసులు విపక్ష నాయకుల వాహనాలను మాత్రమే ఆపి సోదాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ట్రాప్‌లో మహా కూటమి పడిందని వస్తున్న ఆరోపణలను ఖండించారు. సీట్ల పంపకం అంశం ఇంకా చర్చల దశలోనే ఉందని స్పష్టం చేశారు.

TGS
Kodandaram
phonetaping
  • Loading...

More Telugu News