cetral team in srikakulam: శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర బృందం...తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన

  • కలెక్టరేట్‌కు చేరుకున్న ఎనిమిది మంది సభ్యులు
  • తొలుత దెబ్బతిన్న ప్రాంతాల ఫొటో ప్రదర్శన తిలకింత
  • అనంతరం కలెక్టర్‌ నేతృత్వంలో ఉన్నతాధికారులతో సమావేశం

శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన తిత్లీ తుపాన్‌ ప్రభావాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం నేడు జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఎనిమిది మంది సభ్యులున్న ఈ బృందం నేరుగా కలెక్టరేట్‌కు వచ్చింది. బాధిత ప్రాంతాల్లో జరిగిన విధ్వంసాన్ని కళ్లకు కట్టేలా అక్కడ అధికారులు ఏర్పాటు చేసిన చిత్రమాలికను తిలకించారు.

అనంతరం కలెక్టర్‌ ధనుంజయరెడ్డి నేతృత్వంలో ఇతర  ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం బృందం సభ్యులు తుపాన్‌ కారణంగా జిల్లాలో తీవ్రంగా నష్టపోయిన టెక్కలి, వజ్రపుకొత్తూరు, కోటబొమ్మాళి, పలాస, సంతబొమ్మాళి, మందస, మెళియాపుట్టి, కంచిలి, సోంపేట మండలాల్లో క్షేత్ర స్థాయి పర్యటన జరుపుతారు. నష్టం ప్రభావాన్ని అంచనా వేస్తారు.

cetral team in srikakulam
titlee efected areas visit
  • Loading...

More Telugu News