Kidari: మనం సైలెంట్ గా ఉన్నంత కాలం వయొలెన్సే!: మావోలపై కిడారి భార్య కీలక వ్యాఖ్యలు

  • మావోలకు ధైర్యంగా సమాధానం ఇవ్వండి
  • సివేరి సోమ సంతాపసభలో పాల్గొన్న పరమేశ్వరి
  • ఉద్వేగంగా మాట్లాడిన కిడారి భార్య

మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు భార్య పరమేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. సైలెంట్ గా ఉన్నంతకాలం వయొలెన్స్ ను భరించాల్సిందేనని ఆమె అన్నారు. నిశ్బబ్దంగా ఉన్నంతకాలం మావోయిస్టులు హత్యలు చేస్తూనే ఉంటారని, తనకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదని కోరుకుంటున్నానని అన్నారు.

తన భర్త హత్య అనంతరం తొలిసారిగా ప్రజల్లోకి వచ్చిన ఆమె, ఉద్వేగంగా మాట్లాడారు. కిడారితో పాటు హత్యకు గురైన మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ సంతాప సభలో పాల్గొన్న ఆమె, సేవాభావం ఉన్న సోమను మావోలు ఎందుకు హత్య చేశారని ప్రశ్నించారు. ఆదివారం నాడు విశ్రాంతి తీసుకోకుండా, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్లడమే తన భర్త, సోమలు చేసిన తప్పయిందని అన్నారు. ప్రతి ఒక్కరూ మౌనాన్ని వీడి, మావోయిస్టులకు సమాధానం చెప్పాలని పరమేశ్వరి అన్నారు.

Kidari
Mao
Soma
siveri
Parameshwari
Maoists
  • Loading...

More Telugu News