New Delhi: న్యూఢిల్లీలో చంద్రబాబు తరఫున అవార్డు తీసుకున్న సోమిరెడ్డి!

  • చంద్రబాబుకు పాలసీ లీడర్షిప్ అవార్డు
  • న్యూఢిల్లీలో ప్రపంచ వ్యవసాయ సదస్సు
  • రాజ్ నాథ్ సింగ్ చేతులమీదుగా అందుకున్న సోమిరెడ్డి

చంద్రబాబుకు ప్రకటించబడిన అవార్డును ఆయన అందుబాటులో లేకపోవడంతో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అందుకున్నారు. న్యూఢిల్లీలో 11వ 'గ్లోబల్ అగ్రికల్చరల్ లీడర్షిప్ సమ్మిట్ అండ్ లీడర్షిప్ అవార్డు - 2018' సదస్సు జరిగింది. ఈ సదస్సులో భాగంగా, 'పాలసీ లీడర్షిప్ అవార్డు'కు ఏపీ సీఎం నారా నారా చంద్రబాబునాయుడిని ఎంపిక చేసినట్టు గతంలోనే వర్తమానం అందింది. అయితే, చంద్రబాబు బిజీగా ఉన్నందున అవార్డును అందుకునేందుకు ఆయన తరఫున మంత్రి సోమిరెడ్డి వెళ్లారు. సదస్సు ముగింపు సందర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేతుల మీదుగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు సందేశాన్ని చదివి వినిపించారు.

New Delhi
Chandrababu
Somireddy
Rajnath Singh
Award
  • Loading...

More Telugu News