New Delhi: గవర్నర్ కు అత్యవసర పిలుపు... నేడు ఢిల్లీకి నరసింహన్!

  • సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్న నరసింహన్
  • రేపు రాష్ట్రపతితో సమావేశం
  • మూడు రోజులు ఢిల్లీలోనే మకాం

తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కు హస్తిన నుంచి పిలుపు వచ్చింది. వెంటనే వచ్చి కలుసుకోవాలని వచ్చిన పిలుపుతో నేడు నరసింహన్ ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఈ సాయంత్రం ఢిల్లీ చేరుకునే ఆయన, రేపు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలుసుకుంటారు. తెలంగాణలో ఎన్నికలకు ఏర్పాట్లు, ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులపై ఆయన నివేదికను ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. మూడు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేయనున్న నరసింహన్, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశం అవుతారని తెలుస్తోంది. ఈ నెల 27న నరసింహన్ తిరిగి హైదరాబాద్ కు రానున్నారు.

New Delhi
Narasimhan
Governer
Ramnath Kovind
  • Loading...

More Telugu News