BJP: మా ప్రభుత్వమే నిందితులను కాపాడుతోంది: సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు

  • తర్వాతి టార్గెట్ ఈడీ అధికారి రాజేశ్వర్ సింగ్
  • అతడిపై వేటేసేందుకు పక్కా స్కెచ్
  • అదే జరిగితే తీవ్ర నిర్ణయం

బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి సొంత ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వమే నిందితులను కాపాడుతోందని, అటువంటప్పుడు తాను అవినీతిపై పోరాడడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఐ తదుపరి లక్ష్యం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారి రాజేశ్వర్ సింగ్ అని జోస్యం చెప్పిన ఆయన.. రాజేశ్వర్ సింగ్‌పై వేటేయాలని ‘పాత్రధారులు’ భావిస్తున్నారని పేర్కొన్నారు. ఒకవేళ తాను చెప్పినట్టుగా జరిగితే కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరంపై తాను పెట్టిన కేసులన్నింటినీ ఉపసంహరించుకుంటానని సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యానించారు.

BJP
CBI
ED
Subramanian swamy
Congress
Chidambaram
  • Loading...

More Telugu News