team india: భారత్-వెస్టిండీస్ రెండో వన్డే ‘టై’.. డ్రాగా ముగిసిన మ్యాచ్

  • విజయలక్ష్యాన్ని చేరుకోలేకపోయిన విండీస్ జట్టు
  • ఒకే ఒక్క పరుగు చేయలేక డ్రా గా ముగిసిన మ్యాచ్
  • నిర్ణీత 50 ఓవర్లలో విండీస్ స్కోర్:321/ 7  

విశాఖ వేదికగా భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన రెండో వన్డే ‘టైై’ అవడంతో మ్యాచ్ డ్రా గా ముగిసింది. 322 పరుగుల భారీ విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 321 పరుగులు చేసింది. కేవలం, ఒకే ఒక్క పరుగు విండీస్ విజయలక్ష్యానికి గండికొట్టడంతో ఈ మ్యాచ్ ‘టై’ గా ముగిసింది.

కాగా, రెండో వన్డేలో భారీ విజయ లక్ష్యం విండీస్ జట్టు ముందు ఉన్నప్పటికీ, ఆ లక్ష్యాన్ని చేరుకునే తరుణంలో ఒకే ఒక్క పరుగును చేయలేకపోవడం గమనార్హం. తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించింది. రెండో వన్డే కూడా భారత్ తన ఖాతాలో వేసుకుంటుందనుకున్న అభిమానుల ఆశ నెరవేరలేదు.

team india
west indies
Vizag
second one day
  • Loading...

More Telugu News