india-westindies: రెండో వన్డే.. వెస్టిండీస్ విజయ లక్ష్యం 322 పరుగులు

  • టీమిండియా స్కోర్: 321/6 (50 ఓవర్లలో)
  • పరుగుల వర్షం కురిపించిన కోహ్లీ
  • 157 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన కోహ్లీ

విశాఖ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్ విజయ లక్ష్యాన్ని 322 పరుగులుగా టీమిండియా నిర్దేశించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 321 పరుగులు చేసింది. కాగా, కోహ్లీ పరుగుల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్ లో 157 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన కోహ్లీ 13 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు..

టీమిండియా బ్యాటింగ్:

ఆర్జీ శర్మ (4), శిఖర్ ధావన్ (29), ఏటీ రాయుడు (73), ఎంఎస్ ధోనీ (20), ఆర్ఆర్ పంత్ (17) ఆర్ఏ జడేజా (13), విరాట్ కోహ్లీ 157 పరుగులతో మహమ్మద్ షమీ సున్న పరుగులతో నాటౌట్ గా నిలిచారు.

వెస్టిండీస్ బౌలింగ్ :

కేఏజే రోచ్ 1, ఏఆర్ నర్స్- 2 , మకోయ్- 2 , శామ్యూల్స్ 1

india-westindies
second one day
Vizag
  • Loading...

More Telugu News