aravind: పవన్ కల్యాణ్ గారు ఏమంటారోనని టెన్షన్ పడ్డాను: 'అరుంధతి' అరవింద్

  • పవన్ గారితో కలిసి 'అన్నవరం' చేశాను 
  • ఆయనకి నన్ను భీమనేని పరిచయం చేశారు
  • పవన్ ఎంతో ఆత్మీయంగా మాట్లాడతారు

విభిన్నమైన పాత్రలను చేస్తూ మెప్పిస్తూ వస్తోన్న 'అరుంధతి' అరవింద్ తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను గురించి ప్రస్తావించారు. " పవన్ కల్యాణ్ గారి 'అన్నవరం' సినిమాలో విలన్ గా నాకు అవకాశం వచ్చింది. దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు నన్ను పవన్ గారి దగ్గరికి తీసుకెళ్లి పరిచయం చేశారు. అప్పుడు ఆయన నాతో ఎంతో ఆత్మీయంగా మాట్లాడారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఒక సంఘటన జరిగింది.

మా ఫాదర్ విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ లో పనిచేస్తున్నారు. నెలకి రెండు రోజులపాటు ఆయనకి వెహికల్స్ ను చెక్ చేసే పని పడేది. ఓ రోజు రాత్రి ఆయన లింగంపల్లి దగ్గర వెహికల్స్ ను చెక్ చేస్తున్నారు. 'అన్నవరం' షూటింగుకి వస్తోన్న పవన్ గారి కారును ఆపేసి .. ఆ తరువాత పంపించివేసినట్టుగా మా నాన్న నాకు ఫోన్ చేసి చెప్పారు. అరవింద్ మా అబ్బాయేనని పవన్ కి చెప్పానని కూడా అన్నారు. పవన్ సెట్ కి వచ్చేసరికి నాకు టెన్షన్ .. ఏమంటారోనని. 'అరవింద్ గారు .. మీ ఫాదర్ నా కారు ఆపేశారు' అంటూ ఆయన సరదాగా మాట్లాడేసరికి 'హమ్మయ్య' అనుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. 

  • Loading...

More Telugu News