vijay devarakonda: 'టాక్సీ వాలా' నుంచి ఫస్టు సాంగ్ వచ్చేస్తోంది

  • విజయ్ దేవరకొండ నుంచి 'టాక్సీవాలా'
  • ఈ నెల 26వ తేదీన ఫస్టు సాంగ్ 
  • వచ్చేనెల 16న సినిమా విడుదల

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రూపొందిన 'టాక్సీవాలా' ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావలసింది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఆలస్యమైంది. రీసెంట్ గా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. నవంబర్ 16వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టారు.

అందులో భాగంగా ఈ సినిమా నుంచి ఈ నెల 26వ తేదీ (శుక్రవారం) మధ్యాహ్నం 2:30 గంటలకు 'మాటే వినదుగా .. ' అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. తాజాగా అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇంతవరకూ విజయ్ దేవరకొండను మాత్రమే పోస్టర్స్ లో చూపిస్తూ వచ్చారు. తాజా పోస్టర్ లో కథానాయికగా ప్రియాంక జవల్కర్ ను కూడా చూపించారు. ఈ సినిమాలో కథానాయిక ఉందా .. లేదా అనే చర్చలు నడుస్తోన్న సమయంలో ఈ పోస్టర్ రావడం విశేషం. ఫస్టు సాంగ్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి మరి.   

  • Loading...

More Telugu News