venkatesh: మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంకీ

  • 'ఎఫ్ 2'తో బిజీగా వెంకీ 
  • తదుపరి మూవీ 'వెంకీ మామా'
  • కథానాయిక కోసం అన్వేషణ

ప్రస్తుతం వెంకటేశ్ .. అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 2' అనే మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నారు. చిత్రీకరణ పరంగా ఇది ముగింపు దశకి చేరుకుంది. ఈ సినిమా తరువాత ఆయన బాబీ దర్శకత్వంలో 'వెంకీ మామా' అనే మరో మల్టీ స్టారర్ చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే వెంకటేశ్ మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు .. ఆ దర్శకుడే త్రినాథరావు నక్కిన. ఆయన తాజా చిత్రంగా వచ్చిన 'హలో గురు ప్రేమకోసమే' థియేటర్లలో వుంది. గతంలోనే ఆయన వెంకటేశ్ కి కథ వినిపించడం జరిగిపోయింది. ఆ కథను చేయడానికి తాజాగా వెంకటేశ్ ఓకే చెప్పారు. కిరణ్ రెడ్డి .. భరత్ చౌదరి నిర్మించనున్న ఈ సినిమాకు సురేశ్ బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తారు. ఈ సినిమాలో కథానాయిక కోసం అన్వేషణ కొనసాగుతోంది. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.     

  • Loading...

More Telugu News