శబరిమల ఎఫెక్ట్.. ఆలయానికి వెళ్లిన రెహానా ఫాతిమాపై బీఎస్ఎన్ఎల్ బదిలీ వేటు!
- మాస పూజల సందర్భంగా ఆలయానికి వెళ్లిన రెహానా
- అడ్డుకున్న అయ్యప్ప భక్తులు
- ఆందోళనల నేపథ్యంలో అప్రాధాన్య పోస్టుకు బదిలీ
ఎటువంటి ప్రజా సంప్రదింపులు అవసరం లేని ఎక్స్ఛేంజ్ అయిన పళరివట్టమ్ కు ఆమెను పంపారు. ఇప్పటివరకూ రెహానా కొచ్చిలోని బోట్ జెట్టి శాఖలో కస్టమర్ రిలేషన్ విభాగంలో టెక్నీషియన్ గా పనిచేస్తోంది. విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం చూపకపోయినా, వివాదాల నేపథ్యంలోనే ఆమెను బదిలీ చేసినట్లు తెలుస్తోంది. కాగా, కొన్నిరోజుల క్రితం రెహానాను తప్పించాలంటూ శబరిమల కర్మ సమితి బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించింది. అలాగే హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు ఆమెను ముస్లిం సమాజం నుంచి బహిష్కరిస్తున్నట్లు కేరళ ముస్లిం జమాత్ కౌన్సిల్ పేర్కొంది.