escalator: రోలర్ కోస్టర్ గా మారిపోయిన ఎస్కలేటర్.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు!

  • రోమ్ లోని మెట్రో స్టేషన్ లో ఘటన
  • ప్రమాదంలో 20 మందికి గాయాలు
  • సాంకేతిక సమస్యే కారణమన్న అధికారులు

ఇటలీలో ప్రఖ్యాత పర్యాటక ప్రాంతమైన రోమ్ లోని ఓ మెట్రో స్టేషన్ లో ప్రయాణికులకు చుక్కలు కనిపించాయి. అప్పటివరకూ సాధారణంగా వెళుతున్న ఎస్కలేటర్ ఒక్కసారిగా రోలర్ కోస్టర్ లా దూసుకెళ్లడంతో ప్రయాణికులంతా గజగజా వణికిపోయారు. ఎస్కలేటర్ లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఒకరిపై మరొకరు పడిపోయారు. దీంతో పలువురి కాళ్లకు తీవ్రంగా గాయాలయ్యాయి.

ఎస్కలేటర్ వేగంగా కిందకు దూసుకెళ్లడంతో కొందరు యువకుడు పక్కకు దూకేసే ప్రయత్నం చేశారు. వేగంగా కిందకు జారిపోతున్న ఎస్కలేటర్ నుంచి బయటపడ్డ ఇద్దరు యువకులు కుప్పకూలిన ప్రయాణికులను కాపాడే ప్రయత్నం చేశారు. కాగా, ఈ విషయమై స్థానిక అధికారులు మాట్లాడుతూ.. సాంకేతిక సమస్య కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని తెలిపారు. ఈ ఘటనలో 20 మందికి గాయాలు అయ్యాయని వెల్లడించారు.

కొందరికి కాళ్లకు, మరికొందరికి మెడ భాగంలో దెబ్బలు తగిలాయన్నారు. స్థానికంగా ఓ ఫుట్ బాల్ మ్యాచ్ కు ప్రజలు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. కొందరు తాగుబోతు అభిమానులు ఈ ప్రమాదం జరగడానికి ముందు ఎస్కలేటర్ పై గంతులు వేశారనీ, దాని కారణంగానే సాంకేతిక సమస్య తలెత్తి ఉంటుందని భావిస్తున్నామని పేర్కొన్నారు.

escalator
italy
rome
technical issue
speed up
accident
passengers
afraid
shocked
20 wounded
  • Error fetching data: Network response was not ok

More Telugu News