sony razdan: నేనూ బాధితురాలినే...నా పైనా లైంగిక దాడి జరిగింది : అలియాభట్‌ తల్లి సోని రజ్దాన్‌

  • అత్యాచారం చేయాలనుకున్న వ్యక్తి నుంచి తెలివిగా తప్పించుకున్నాను
  • నిందితుడి కుటుంబంపై ప్రభావం పడుతుందని ఫిర్యాదు చేయలేదు
  • నోరు విప్పిన ప్రముఖ టీవీ, సినీ నటి

ప్రముఖ హిందీ టీవీ, సినీ నటి, అలియాభట్‌ తల్లి సోని రజ్దాన్‌ సంచలన విషయాన్ని బయటపెట్టారు. గతంలో తనపై లైంగిక దాడి జరిగినట్టు వెల్లడించారు. 'నేనూ లైంగిక వేధింపులను ఎదుర్కొన్నాను. నేనూ బాధితురాలినే. ఏకంగా నాపై అత్యాచార యత్నమే జరిగింది. అయితే ఆ సమయంలో తెలివిగా వ్యవహరించి సదరు వ్యక్తి నుంచి తప్పించుకున్నాను’ అని చెప్పారు.

మీటూ ఉద్యమం నేపథ్యంలో గతంలో తనపై జరిగిన అత్యాచార ప్రయత్నాన్ని క్వింట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనీ తెలిపారు. ఓ షూటింగ్‌ సందర్భంగా ఆ వ్యక్తి నాపై అఘాయిత్యానికి ప్రయత్నించినా, అతని ప్రయత్నం ఫలించలేదని తెలిపారు. అప్పట్లో అది దారుణ ఘటనే కాని నేను ఫిర్యాదు చేస్తే అవతలి వ్యక్తి కుటుంబంపై దాని ప్రభావం పడుతుందని మిన్నకుండిపోయానని సోనీ తెలిపారు.

కాకపోతే ఆ తర్వాత ఆ వ్యక్తితో మాట్లాడడం మానేశానన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అలోక్‌నాథ్‌ ప్రవర్తన గురించి సోనీ మాట్లాడుతూ ‘అతని తీరు అమర్యాదకరంగానే ఉంటుంది. మద్యం మత్తులో మరీ విపరీతంగా ప్రవర్తిస్తాడు, నన్ను అతను చూసే పద్ధతి కూడా నచ్చేది కాదు’ అని సోనీరజ్దాన్‌ తెలిపారు.

sony razdan
MeToo India
sexual herasment
  • Loading...

More Telugu News