Supreme Court: సీబీఐ కొత్త డైరెక్టర్ నాగేశ్వరరావు సచ్ఛీలుడేం కాదు.. ఆయనపై కూడా అవినీతి ఆరోపణలున్నాయి!: సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్

  • ఈ నియామకంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా
  • మన్నెంను నిబంధనలకు విరుద్ధంగా నియమించారు
  • సుప్రీంను ఆశ్రయించిన సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ

కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) తాత్కాలిక డైరెక్టర్ గా నియమితులైన మన్నెం నాగేశ్వరరావు సచ్ఛీలుడేమీ కాదని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. నాగేశ్వరరావుపై కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయని వెల్లడించారు. ఆయన నియామకం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని విమర్శించారు.

ఈ రోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు. కాగా, తనను నిబంధనలకు విరుద్ధంగా తప్పించారని ఆరోపిస్తూ అలోక్ వర్మ ఈ రోజు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆయన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపడతామని స్పష్టం చేసింది.

పరస్పరం అవినీతి ఆరోపణలు గుప్పించుకోవడంతో సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాలను కేంద్రం సెలవుపై పంపిన సంగతి తెలిసిందే. కొత్త సీబీఐ బాస్ గా తెలుగు వ్యక్తి, వరంగల్ వాసి మన్నెం నాగేశ్వరరావును నియమించింది.

Supreme Court
cbi
Alok varma
rakesh asthabna
bribes
corruption
leave
new boss
director
mannem nageswara rao
  • Loading...

More Telugu News