Andhra Pradesh: వైజాగ్ అద్భుతంగా ఉందన్న విరాట్ కోహ్లీ.. స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు!

  • రెండో వన్డే కోసం వైజాగ్ చేరుకున్న టీమిండియా
  • నేడు విండిస్ తో తలపడనున్న కోహ్లీ సేన
  • విరాట్ ట్వీట్ కు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు

వెస్టిండిస్ జట్టుతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా భారత క్రికెట్ జట్టు వైజాగ్ కు చేరుకుంది. ఈ నేపథ్యంలో వైజాగ్ అందాలకు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ముగ్దుడయ్యాడు. సముద్రతీరం కనిపించేలా ఓ సెల్ఫీ తీసుకుని ‘వైజాగ్ అద్భుతమైన ప్రదేశం. ఇక్కడకు రావడాన్ని చాలా ఇష్టపడతా’ అని ట్వీట్ చేశాడు.

దీనికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు స్పందించారు. విశాఖపట్నం అనేది దేశంతో పాటు అంతర్జాతీయంగా పర్యాటకులకు అత్యున్నత గమ్యస్థానం అవుతుందని తెలిపారు. విశాఖలో జరిగే రెండో వన్డేలో సైతం భారత్ ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు. మ్యాచ్ సందర్భంగా కోహ్లీ సేనకు శుభాకాంక్షలు చెప్పారు.

Andhra Pradesh
Visakhapatnam District
Virat Kohli
Chandrababu
Chief Minister
west indies
Cricket
one day tour
5 matches
  • Loading...

More Telugu News