Prabhas: ప్రభాస్ పుట్టిన రోజు వేళ అపశ్రుతి.. అభిమానుల కారణంగా నలుగురికి గాయాలు!

  • కృష్ణాలో బైక్ ర్యాలీ నిర్వహించిన అభిమానులు
  • కారుపై జారిపడ్డ ప్రభాస్ ప్లెక్సీ
  • అదుపుతప్పి పాదచారులను ఢీకొట్టిన కారు

రెబెల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా కృష్ణా జిల్లా పెనమలూరులో అపశ్రుతి చోటుచేసుకుంది. నిన్న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా కొందరు అభిమానులు ఆయన ప్లెక్సీని బైక్ పై పెట్టుకుని ఊరేగింపు చేపట్టారు. అయితే వాహనాలు వేగంగా వెళుతున్న క్రమంలో ఆ ప్లెక్సీ అదుపు తప్పి పక్కనే వెళుతున్న కారు ముందు అద్దంపై పడిపోయింది. దీంతో రోడ్డుపై ఏముందో కనిపించకపోవడంతో కారు ఒక్కసారిగా రోడ్డుపై వెళుతున్న పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి.

దీంతో గాయపడ్డవారిని వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కాగా, రోడ్డుపై అడ్డదిడ్డంగా బైక్ లను నడుపుతూ, హారన్లు కొడుతూ ప్రభాస్ అభిమానులు ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.

Prabhas
Talking Movies
birthday
Krishna District
Road Accident
bike
car
plexy
  • Loading...

More Telugu News