Pawan Kalyan: హుటాహుటిన లక్నోకు... మాయావతిని కలిసేందుకు వెళ్లిన పవన్ కల్యాణ్!

  • మాయావతితో నేడు పవన్ చర్చలు
  • తృతీయ కూటమి ఏర్పాటుపై మాట్లాడేందుకే
  • అఖిలేష్ యాదవ్ నూ కలిసే అవకాశం

ఏమాత్రం ముందస్తు ప్రణాళిక, మీడియాకు సమాచారం లేకుండా జనసేన అధినేత పవన్ కల్యాణ్, లక్నోకు బయలుదేరి వెళ్లారు. బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతిని కలిసి, ఆమెతో చర్చలు జరిపేందుకే పవన్ వెళ్లినట్టు తెలుస్తోంది. మాయావతితో పాటు ఆయన మరికొందరు నేతలనూ కలుస్తారని తెలుస్తోంది. వీరిమధ్య సాగే చర్చలపై ఎటువంటి సమాచారం లేకున్నా, బీజేపీకి వ్యతిరేకంగా ప్రారంభించాలని చూస్తున్న రాజకీయ పార్టీల కూటమిపై చర్చించేందుకు పవన్ వెళ్లినట్టు సమాచారం. మాయావతితో పాటు అఖిలేష్ యాదవ్ నూ పవన్ కలిసే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.

Pawan Kalyan
Mayawati
Lucknow
Akhilesh Yadav
  • Loading...

More Telugu News