ys jagan: 293వ రోజుకు చేరుకున్న జగన్ పాదయాత్ర!

  • విజయనగరం జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్ర
  • నేడు సన్యాసిరాజు పేట నుంచి ప్రారంభం
  • చపచప బుచ్చంపేట వరకూ యాత్ర

ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, తనను కలిసిన వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇస్తూ సాగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర, నేడు 293వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో కొనసాగుతున్న యాత్ర, మరో వారం రోజుల్లో శ్రీకాకుళం జిల్లాకు చేరనుంది.

 నేడు, సన్యాసిరాజు పేట నుంచి ప్రారంభం కానున్న నడక, బాగువాలస, నక్కడవలస క్రాస్, తడిలోవ, మక్కువ మండలం గునికొండ వలస మీదుగా చపచప బుచ్చంపేట వరకూ కొనసాగుతుందని వైసీపీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

కాగా, 'తిత్లీ' తుఫాను బాధితులను పరామర్శించేందుకు వైఎస్ జగన్ రాలేదని అధికార పక్షం నేతలు విమర్శిస్తున్న వేళ, నిన్న జగన్, ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ, తాను మరో వారంలో శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించనున్నానని, కనీసం 50 రోజుల పాటు అక్కడే ఉంటానని వెల్లడించిన సంగతి తెలిసిందే.

ys jagan
Jagan
Padayatra
Vijayanagaram District
Srikakulam District
  • Loading...

More Telugu News