APSRTC: దసరా సీజన్ లో అదరగొట్టిన ఏపీఎస్ ఆర్టీసీ!

  • 5,778 ప్రత్యేక సర్వీసులు నడిపిన ఆర్టీసీ
  • 5.30 లక్షల మంది గమ్యస్థానాలకు
  • రూ. 209 కోట్ల ఆదాయం

ఇటీవలి దసరా సీజన్ లో ఏపీఎస్ ఆర్టీసీ అదరగొట్టింది. మొత్తం 5,778 ప్రత్యేక బస్ సర్వీసులను నడిపించిన సంస్థ 5.30 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చిందని మేనేజింగ్ డైరెక్టర్ సురేంద్ర బాబు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలకు కూడా స్పెషల్ సర్వీసులు నడిపించామని, మొత్తం రూ. 209 కోట్ల ఆదాయాన్ని ఆర్జించామని తెలిపారు. గత సంవత్సరం దసరా సీజన్ లో రూ. 194 కోట్ల ఆదాయం రాగా, ఈ సంవత్సరం దానికి అదనంగా రూ. 15 కోట్లు వచ్చిందని చెప్పారు. దసరా సీజన్ లో అత్యుత్తమ సేవలను తమ సిబ్బంది అందించారని చెప్పిన సురేంద్ర బాబు, ఉద్యోగులను అభినందించారు.

APSRTC
Dasara
Special Bus
Surendra Babu
  • Loading...

More Telugu News