Hero Raghav: రాయలసీమలో జరిగిన పరువు హత్య నేపథ్యంలో ‘బంగారి బాలరాజు’

  • కోటేంద్ర దుద్యాల దర్శకత్వంలో ‘బంగారి బాలరాజు’
  • ప్రణయ్ పరువు హత్యపై అనేక చర్చలు
  • ప్రేమికులు, తల్లిదండ్రుల సమస్యలు చర్చించాం

రాయలసీమలో జరిగిన ఒక యథార్థ పరువు హత్య నేపథ్యంలో ‘బంగారి బాలరాజు’ సినిమా తెరకెక్కుతోందని చిత్ర హీరో రాఘవ్ మీడియాకు తెలిపారు. కోటేంద్ర దుద్యాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రాఘవ్ సరసన కరోణ్య కత్రిన్ కథానాయికగా నటిస్తోంది. ఈ మధ్య పరువు కోసం తల్లిదండ్రులు ఎంతటి దారుణానికైనా వెనకాడట్లేదని.. రాయలసీమలో నిజంగా జరిగిన అలాంటి పరువు హత్య నేపథ్యంలో ఈ కథ ఉంటుందని రాఘవ్ వెల్లడించాడు.

ముఖ్యంగా ప్రేమ, పరువు హత్యలతో పాటు తల్లీకొడుకుల సెంటిమెంట్, ఎమోషన్ కూడా అందరినీ ఆకట్టుకుంటుందని తెలిపాడు. తాజాగా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ పరువు హత్య అనేక చర్చలకు దారితీసిందని.. ఇలాంటి ఘటనలకు తమ సినిమా ద్వారా సరైన ముగింపునిచ్చామని రాఘవ్ పేర్కొన్నాడు. ప్రేమికులు, తల్లిదండ్రుల సమస్యలను తమ చిత్రంలో చర్చించామని తెలిపాడు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News