Sayyad: సోమాలియాలో నరకయాతన అనుభవిస్తున్న నా సోదరిని కాపాడండి: సుష్మాకు హైదరాబాదీ అభ్యర్థన

  • సయ్యద్ హసన్‌తో 2003లో వివాహం
  • 2013 వరకూ హైదరాబాద్‌లోనే నివాసం
  • భార్యాపిల్లలను సోమాలియాలో వదిలేసిన సయ్యద్

సోమాలియాలో తన సోదరిని, ఆమె పిల్లలను కనీసం తిండి కూడా పెట్టకుండా అత్తింటి వారు వేధిస్తున్నారని హైదరాబాద్‌కు చెందిన సోదరుడు మొహమ్మద్ వహియుద్దీన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన సోదరినీ, ఆమె పిల్లలను కాపాడాలని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను అభ్యర్థిస్తున్నాడు. తన సోదరికి సోమాలియా జాతీయుడైన సయ్యద్ హసన్ ఇబ్రహీంతో 2003లో వివాహం జరిగిందని.. అప్పటి నుంచి 2013 వరకూ హైదరాబాద్‌లోనే ఉన్నారని.. వారికి ఐదుగురు సంతానమని వహియుద్దీన్ తెలిపాడు.

2013లో తన తల్లిదండ్రులు.. పిల్లలను చూడాలంటున్నారని చెప్పిన సయ్యద్ భార్యాపిల్లలను సోమాలియా తీసుకెళ్లాడని.. వారిని అక్కడే వదిలేసి తను మాత్రం అమెరికా వెళ్లిపోయాడని వహియుద్దీన్ తెలిపారు. అప్పటి నుంచి తన సోదరినీ, పిల్లలను అత్తింటి వారు వేధిస్తున్నారని, కాబట్టి వెంటనే వారిని భారత్‌కు తీసుకురావాలని సుష్మాను వేడుకున్నాడు.

Sayyad
Sushma Swaraj
Somalia
Vahiyuddin
India
America
  • Loading...

More Telugu News