Pavan kalyan: తెలంగాణలో పోటీ చేసే అంశాన్ని దాటవేసిన పవన్

  • జగన్‌లా తప్పించుకుపోను
  • శ్రీకాకుళంలో కాలినడకన పర్యటించా
  • ప్రజలు తీవ్రంగా నష్టపోయారు

తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందా? అని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ని విలేఖరులు ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా దాటవేశారు. నేడు విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు హర్షణీయమన్నారు. తాను జగన్‌లా తప్పించుకుపోనని చెప్పారు.

శ్రీకాకుళంలో తాను కాలినడకన తిరిగి అక్కడి పరిస్థితులను స్వయంగా తెలుసుకున్నానని పవన్ తెలిపారు. ఏ మూలకు వెళ్లినా సమస్యలున్నాయన్న పవన్.. అక్కడి ప్రజలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధులను గ్రామాల్లోకి రానిచ్చే పరిస్థితి లేదని పవన్ స్పష్టం చేశారు.

Pavan kalyan
Jagan
Janasena
High Court
Srikakulam
  • Loading...

More Telugu News