Smart Phones: స్మార్ట్‌ఫోన్లపై బంపర్ ఆఫర్ ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్

  • ఆనుస్ జెన్‌ఫోన్ 5 జెడ్ ఫోన్లపై డిస్కౌంట్
  • 24 నుంచి 27 వరకూ డిస్కౌంట్ ఆఫర్
  • యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై అదనంగా 10 శాతం

స్మార్ట్ ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై తైవాన్‌కు చెందిన మల్టీనేషనల్ కంపెనీ ఆనుస్ జెన్‌ఫోన్ 5 జెడ్ ఫోన్లపై రూ.5000 వరకూ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ నెల 24 నుంచి 27వరకూ ఈ డిస్కౌంట్ ఆఫర్ ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ సంస్థ ప్రకటించింది.

3జీబీ ర్యామ్ ఆసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1 ఫోన్ రూ. 9,999కు లభిస్తుందని..  4జీబీ ర్యామ్ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ. 12,999 నుంచి మొదలవుతుందని... 6జీబీ ర్యామ్ అయితే రూ. 14,999తో మొదలవుతుందని కంపెనీ పేర్కొంది. అన్ని వేరియంట్ల ఫోన్లపై ఈఎంఐ ఛార్జీలుండవని... అంతేకాకుండా యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా ఆనుస్ ఫోన్లను కొనుగోలు చేసిన వినియోగదారులకు అదనంగా 10 శాతం డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ తెలిపింది.

Smart Phones
Anus Zen Phone
Flipcart
Discount
  • Loading...

More Telugu News