cbi: సీబీఐ స్పెషల్ డైరెక్టర్ అవినీతి వ్యవహారంలో డీఎస్పీకి ఏడు రోజుల కస్టడీ
- డీఎస్పీ దేవేందర్ కుమార్ ను కోర్టులో ప్రవేశపెట్టిన సీబీఐ
- ఏడు రోజుల కస్టడీ విధించిన సీబీఐ ప్రత్యేక కోర్టు
- సాక్షి వాంగ్మూలాన్ని ఫోర్జరీ చేశారంటూ సీబీఐ ఆరోపణ
సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానా వ్యవహారంలో ఆ సంస్థ డీఎస్పీ దేవేందర్ కుమార్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనను ఈరోజు సీబీఐ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయనను ఏడు రోజుల కస్టడీకి కోర్టు పంపింది. మరోవైపు ఆయన నివాసం, కార్యాలయంలో సోదాలు నిర్వహించిన అధికారులు... మొబైల్ ఫోన్లు, ఐపాడ్లను స్వాధీనం చేసుకున్నారు.
మాంసం ఎగుమతుల వ్యాపారాన్ని నిర్వహించే మొయిన్ ఖురేషీకి సంబంధించిన కేసులో దేవేందర్ కుమార్ దర్యాప్తు అధికారిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా సాక్షి అయిన హైదరాబాద్ వ్యాపారి సానా సతీష్ బాబు వాంగ్మూలాన్ని తప్పుగా నమోదు చేసి, ఫోర్జరీకి పాల్పడినట్టు సీబీఐ ఆరోపిస్తోంది.