aravinda sametha: నేనూ రాయలసీమ వాడినే.. ‘అరవింద సమేత’లో ఫ్యాక్షనిజం లేదు: సీపీఐ రామకృష్ణ

  • సీమ గురించి మాట్లాడే హక్కు బీజేపీ నేతలకు లేదు
  • ప్రజలను కించపరిచే సన్నివేశాలు లేవు
  • ఫ్యాక్షనిజం లేకుండా చేయొచ్చన్నదే చిత్ర సారాంశం

’అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం రాయలసీమ ప్రజలను కించపరిచే విధంగా ఉందని ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.ఈ వ్యాఖ్యలపై సీపీఐ రామకృష్ణ ఘాటు కౌంటర్ ఇచ్చారు.ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాయలసీమ గురించి మాట్లాడే హక్కు బీజేపీ నేతలకు లేదని అన్నారు. తానూ రాయలసీమ వాడినేనని, సీమ ప్రజలను కించపరిచేలా ఎటువంటి సన్నివేశాలు ఈ చిత్రంలో లేవని, ఫ్యాక్షనిజం కూడా లేదని స్పష్టం చేశారు. ప్రశాంతత కోరుకునే వారందరితో కలిసి సీమలో ఫ్యాక్షనిజం లేకుండా చేయొచ్చన్నదే ఈ సినిమా సారాంశమని అన్నారు.

aravinda sametha
cpi ramakrishna
factionism
  • Loading...

More Telugu News