pinarayi vijayan: దీనికంతా కారణం ఆరెస్సెస్సే: కేరళ సీఎం పినరయి విజయన్

  • శబరిమల పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తతకు ఆరెస్సెస్సే కారణం
  • శబరిమలను యుద్ధభూమిగా మార్చారు
  • మీడియాపై దాడి జరగడం కేరళ చరిత్రలోనే తొలిసారి

శబరిమల ఆలయంలోకి మహిళలు వెళ్లకుండా ఆందోళనకారులు అడ్డుకోవడం వెనుక ఆరెస్సెస్ హస్తం ఉందని కేరళ సీఎం పినరయి విజయన్ ఆరోపించారు. శబరిమల పరిసర ప్రాంతాల్లో నెలకొన్న ఉద్రిక్తతలకు ఆరెస్సెస్సే కారణమని మండిపడ్డారు.

ఆలయంలోకి మహిళలు ప్రవేశించవచ్చంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని, మహిళల రక్షణ కోసం భద్రతా ఏర్పాట్లను చేసిందని చెప్పారు. ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ మహిళలను అడ్డుకునే ప్రయత్నం చేయలేదని తెలిపారు. కానీ, ఆలయ పరిసర ప్రాంతాలను ఆరెస్సెస్ యుద్ధభూమిగా మార్చిందని విమర్శించారు.

వాహనాలను ఆందోళనకారులు తనిఖీ చేశారని, మహిళా భక్తులు, మీడియాపై దాడికి తెగబడ్డారని విజయన్ మండిపడ్డారు. మీడియాపై దాడి జరగడం కేరళ చరిత్రలోనే ఇది తొలిసారని అన్నారు. ఇంత జరిగినా శబరిమల వద్ద లా అండ్ ఆర్డర్ అదుపుతప్పలేదని చెప్పారు. 

pinarayi vijayan
sabarimala
kerala
rss
protests
Supreme Court
  • Loading...

More Telugu News