Chandrababu: సీట్ల త్యాగాలకు సిద్ధమని చంద్రబాబు ప్రకటించడం హర్షణీయం: వీహెచ్

  • మిగిలిన పార్టీలూ ఆ దిశగా సానుకూలంగా ఆలోచించాలి
  • కేసీఆర్ ఎంత తిట్టినా బాబు ఒక్క మాటా మాట్లడలేదు
  • వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయట్లేదు

కేసీఆర్ ను గద్దె దించేందుకు సీట్ల త్యాగాలకు సిద్ధమని  ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించడం హర్షణీయమని టీ-కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మహాకూటమిలోని మిగిలిన పార్టీలు తెలంగాణ జన సమితి (టీజేఎస్), సీపీఐ లు కూడా ఆ దిశగా సానుకూలంగా ఆలోచించాలని సూచించారు.

ఈ సందర్భంగా చంద్రబాబుపై కేసీఆర్ ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. చంద్రబాబును కేసీఆర్ ఎంత తిట్టినా ఒక్క మాట కూడా బాబు మాట్లడలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు టికెట్ల కేటాయింపుపై ఢిల్లీలో చర్చలకు తనను పిలవలేదని విమర్శించిన వీహెచ్, తెలంగాణలో తన కంటే పెద్ద బీసీ నాయకుడు ఎవరు ఉన్నారని ప్రశ్నించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో తాను పోటీ చేయట్లేదని వీహెచ్ స్పష్టం చేశారు.

Chandrababu
vh
mahakutami
  • Loading...

More Telugu News