chada venkatareddy: రెండు సీట్లయితే ఒప్పుకోం: చాడ వెంకటరెడ్డి

  • సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయి
  • కేసీఆర్ ను ఓడించేందుకు కూటమిలోనే ఉంటాం
  • హుస్నాబాద్ లో తప్ప మరెక్కడా పోటీ చేయను

మహాకూటమిలో సీట్ల సర్దుబాటుపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని సీపీఐ నేత చాడ వెంకట రెడ్డి అన్నారు. రెండు సీట్లు మాత్రమే ఇస్తామంటే అంగీకరించబోమని చెప్పారు. కూటమి నుంచి బయటకు వెళ్లే ప్రసక్తే లేదని, కేసీఆర్ ను ఓడించేందుకు కూటమిలోనే ఉంటామని స్పష్టం చేశారు. మహాకూటమి ఏర్పాటుతో కేసీఆర్ కు భయం పట్టుకుందని చెప్పారు. ఉద్యమకారులను శత్రువులుగా భావిస్తున్న కేసీఆర్... ఉద్యమ ద్రోహులను ఆదరిస్తున్నారని విమర్శించారు. తాను హుస్నాబాద్ లో తప్ప మరెక్కడా పోటీ చేయనని... రామగుండం నుంచి పోటీ చేస్తానన్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. 

chada venkatareddy
mahakutami
cpi
  • Loading...

More Telugu News