Guntur District: గుంటూరు జిల్లా అధికారుల రికార్డు.. ఒకే రోజు 50 వేల మంది ఓటర్ల నమోదు!

  • 560 కాలేజీల్లో ఓటర్ల నమోదు
  • అద్భుతంగా సహకరించారన్న కలెక్టర్ శశిథర్
  • పరేడ్ గ్రౌండ్ లో అవగాహన కార్యక్రమం 

గుంటూరు జిల్లా అధికారులు చరిత్ర సృష్టించారు. ఒకేరోజు జిల్లా వ్యాప్తంగా 50,000 మందిని నిన్న ఓటర్లుగా నమోదు చేయించి రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోన శశిథర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 560 కళాశాలల్లో విద్యార్థులు తమ ఓటు హక్కును నమోదు చేసుకున్నారని తెలిపారు. యువత ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు.

తాజాగా 50 వేల మంది ఓటర్ల నమోదుకు కాలేజీలు, విద్యార్థులు అధికారులకు అద్భుతంగా సహకరించారని తెలిపారు. పలువురు విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారని వెల్లడించారు. ఓటర్ల నమోదు విషయంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లాలోని పోలీస్ పరేడ్ మైదానంలో హాట్ ఎయిర్ బెలూన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Guntur District
Andhra Pradesh
voter
registration
District Collector
kona sasidhar
  • Error fetching data: Network response was not ok

More Telugu News