pawan kalyan: గవర్నర్ నరసింహన్ తో భేటీ కానున్న పవన్ కల్యాణ్

  • సాయంత్రం 4 గంటలకు రాజ్ భవన్ లో భేటీ
  • పవన్ తో పాటు గవర్నర్ ను కలవనున్న పలువురు జనసేన నేతలు
  • తుపాను బాధితులను ఆదుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరనున్న పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు గవర్నర్ నరసింహన్ తో భేటీ కానున్నారు. హైదరాబాదులోని రాజ్ భవన్ లో సాయంత్రం 4 గంటలకు జనసేన నేతలతో కలసి గవర్నర్ తో పవన్ సమావేశం కానున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ కార్యాలయం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను బాధిత ప్రాంతాల్లో పవన్ పర్యటించిన సంగతి తెలిసిందే. ప్రత్యక్షంగా బాధితులను కలసి వారి కష్టాలను ఆయన తెలుసుకున్నారు. ప్రతి అంశాన్ని నోట్ బుక్ లో రాసుకున్నారు. బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో జనసేన నేతలు మాట్లాడుతూ, తుపాను బాధితులను ఆదుకునేలా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్ ను పవన్ కోరుతారని తెలిపారు. 

pawan kalyan
governor
narasimhan
titli
  • Loading...

More Telugu News