shivaparvathi: నా చిన్నప్పుడే నన్ను మాస్టారు శపించారు .. అది కాస్త వరమైంది: నటి శివపార్వతి

  • చిన్నప్పటి నుంచి అద్దం అంటే ఇష్టం
  • స్కూల్ బ్యాగులో అద్దం తీసుకెళ్లడం అలవాటు
  •  బ్రేక్ టైమ్ లోను పౌడర్ అద్దుకునే దానిని

ఇటు బుల్లితెరపైనా .. అటు వెండితెరపైన నటిగా శివపార్వతికి మంచి పేరుంది. తాజాగా ఆమె 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ అనేక ఆసక్తికరమైన విషయాలను గురించి ప్రస్తావించారు. "అద్దానికి .. నా జీవితానికి చాలా అవినాభావ సంబంధం వుంది. చిన్నప్పటి నుంచి నాకు అద్దం అంటే ఇష్టం. తెనాలిలో నా స్కూలు విద్య నడిచింది.

అవి నేను ఆరో తరగతి చదువుతోన్న రోజులు. అందరు పిల్లలు సంచీలో బుక్స్ .. పెన్నులు పెట్టుకునేవారు. వాటితో పాటు నేను అద్దం .. పౌడర్ పెట్టుకుని వెళ్లేదానిని. బ్రేక్ టైమ్ లో అంతా స్నాక్స్ కొనుక్కుని తినేవాళ్లు. నేను మాత్రం ట్యాప్ దగ్గర ముఖం కడుక్కుని, అద్దం చూసుకుంటూ పౌడర్ వేసుకునే దానిని. అది చూసిన మా మాస్టారు 'నీకు చదువబ్బదు .. జీవితాంతం నువ్వు ఇలా అద్దం పట్టుకునే బతుకుతావు' అని తిట్టారు. ఆయన అలా శపించినందుకు బాధపడ్డాను. ఆర్టిస్టుగా మంచి పేరు వచ్చాక, మాస్టారు శాపం .. వరమైంది అనే విషయం అర్థమైంది' అని చెప్పుకొచ్చారు.  

  • Loading...

More Telugu News