Andhra Pradesh: వైజాగ్ కు చేరుకున్న చంద్రబాబు.. మరికాసేపట్లో ఫిన్ టెక్ సదస్సుకు హాజరు!

  • నోవాటెల్ లో జరగనున్న సదస్సు
  • ఏపీలో కంపెనీల స్థాపనకు ఒప్పందాలు
  • స్టాళ్లను ఏర్పాటు చేసిన పలు కంపెనీలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు విశాఖపట్నంకు చేరుకున్నారు. ఈ రోజు వైజాగ్ లోని నోవాటెల్ లో వేర్వేరు ఐటీ కంపెనీల సీఈవోలు, అధినేతలతో చంద్రబాబు మరికాసేపట్లో భేటీ కానున్నారు. అనంతరం ఫిన్ టెక్ కార్యక్రమ ప్రారంభోత్సవంలో సీఎం పాల్గొంటారు. ఈ సందర్భంగా ఫిన్ టెక్ సీఎక్స్ వో రౌండ్ టేబుల్ సదస్సులో చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేశ్ పాల్గొననున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి లోకేశ్ ఏపీలో ఐటీ రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు సహా పలు అంశాలపై ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆయా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోనుంది. ప్రస్తుతం మిలియన్ డాలర్ ఛాలెంజ్ కింద ఫైనల్ చేరిన కంపెనీలు ఇక్కడి నోవాటెల్ హోటల్ లో స్టాళ్లను ఏర్పాటు చేశాయి.

Andhra Pradesh
Visakhapatnam District
million doller challenge
novatel
fintek
meeting
it companies
Nara Lokesh
Chandrababu
Chief Minister
  • Loading...

More Telugu News