Chandrababu: వైఎస్ ఏం చేశారు? జగన్ ఏం చేస్తున్నారు?: సాధినేని యామిని విమర్శలు

  • పాదయాత్ర చేసే నైతిక హక్కు జగన్ కు లేదు
  • డ్వాక్రా మహిళలకు వైఎస్ ఏమీ చేయలేదు
  • ఒక్కొక్కరికీ రూ. 10 వేలు ఇచ్చిన ఘనత చంద్రబాబుదే

పాదయాత్ర చేసే నైతిక హక్కు వైకాపా అధినేత వైఎస్ జగన్ కు లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సాధినేని యామిని నిప్పులు చెరిగారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆమె, జగన్ చేస్తున్న యాత్ర అబద్ధాలను ప్రచారం చేస్తున్న యాత్రని అన్నారు. డ్వాక్రా మహిళల గురించి మాట్లాడే అర్హత జగన్ లేదని విమర్శించారు.

గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న వేళ, మహిళలకు ఎటువంటి మేలూ చేయలేదని, వైఎస్ హయాంలో మహిళలకు ఏం చేశారని ప్రశ్నించారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు 200 మంది డ్వాక్రా మహిళలు ఆత్మహత్యలకు పాల్పడితే, కనీసం కూడా స్పందించలేదని ఆరోపించిన ఆమె, చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరవాత, బడ్జెట్ లోటున్నా, 86 లక్షల మందికి సాయం అందిందని అన్నారు. చంద్రన్న పసుపు, కుంకుమ కింద రూ. 8,604 కోట్లను అందించామన్నారు. ఒక్కొక్కరికీ రూ. 10 వేల చొప్పున అందజేసిన ఘనత చంద్రబాబుదేనని చెప్పుకొచ్చారు.

Chandrababu
Jagan
Yamini
Telugudesam
YSR
  • Loading...

More Telugu News