CID: 21 ఏళ్ల పాటు ప్రసారమైన సీరియల్ కు ముగింపు!

  • ముగియనున్న 'సిఐడి'
  • 29న చివరి ఎపిసోడ్
  • నిరాశలో బుల్లితెర అభిమానులు

టెలివిజన్ చరిత్రలో అత్యంత సుదీర్ఘకాలం ప్రసారమైన క్రైమ్ సీరియల్ 'సీఐడీ' ముగియనుంది. 1997 నుంచి సోనీ టీవీలో ప్రసారమవుతూ వచ్చిన ఈ సీరియల్ ఈ నెల 29తో ముగియనుంది. సోమవారం నాడు సీరియల్ చివరి ఎపిసోడ్ ప్రసారమవుతుందని, నిర్మాతలు తెలిపారు. ఇప్పటివరకూ సీరియల్ 1,546 ఎపిసోడ్లు ప్రసారమైంది. తొలి ఎపిసోడ్ నుంచే అభిమానుల ఆదరణను చూరగొన్న ఈ సీరియల్, ఇప్పటికీ అంతే ఆదరణతో నడుస్తోంది. పలు భాషల్లోకి డబ్ అయి కూడా ఈ 'సీఐడీ' అలరించింది.

ఇక దీని ముగింపుపై ఇనస్పెక్టర్ దయా పాత్ర పోషించిన దయానంద్ షెట్టి స్పందిస్తూ, సీరియల్ విషయంలో అంతా బాగానే ఉందని, టీఆర్‌పీ రేటింగ్స్ కూడా సంతృప్తికరంగా ఉన్నాయని, ఇటీవల షూటింగ్ మధ్యలో నిర్మాత బీపీ సింగ్ వచ్చి, సీరియల్ ను ముగిస్తున్నట్లు చెప్పారని అన్నారు. ఆయన మాటలు తమతో పాటు అభిమానులను కూడా నిరాశపరుస్తున్నాయని అన్నారు.

CID
TV
Seriel
End
Dayanand Shetty
Sony
  • Loading...

More Telugu News