Sunny Leone: సన్నీలియోన్ సినిమాకు నిరసనల సెగ.. కర్ణాటకలో ఆందోళన నిర్వహించిన రక్షణ వేదికె యువసేన!

  • వీర మహాదేవి చిత్రంలో సన్నీ నటించడంపై ఆగ్రహం
  • వెంటనే షూటింగ్ ను నిలిపివేయాలని డిమాండ్
  • చేతులను బ్లేడ్లతో కోసుకున్న యువకులు

తెలుగు, కన్నడ సహా ఐదు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ‘వీర మహాదేవి’ సినిమాకు నిరసనల సెగ తగిలింది. ఈ సినిమా నుంచి శృంగార తార సన్నీ లియోన్‌ను తప్పించాలని కర్ణాటక రక్షణ వేదికె యువసేన బెంగళూరులో ధర్నాకు దిగింది. కాగా, ఈ సందర్భంగా కొందరు యువకులు వీర మహాదేవి సినిమా చిత్రీకరణను వ్యతిరేకిస్తూ చేతులను బ్లేడ్లతో కోసుకున్నారు. వీర మహాదేవిని అవమానించే రీతిలో సన్నీ లియోన్ కు సినిమాలో లీడ్ రోల్ ఇవ్వడంపై ఆందోళనకారులు మండిపడుతున్నారు.


సినిమా షూటింగ్ ను వెంటనే ఆపేయాలనీ, వాడి ఉదయన్‌ అందరికీ క్షమాపణ చెప్పాలని కర్ణాటక రక్షణ వేదికె యువసేన డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా సన్నిలియోన్ పోస్టర్లను తగులబెట్టి నిరసన తెలియజేశారు. మరోవైపు చిత్రదుర్గంలోనూ సన్నిలియోన్ ను వీరమహాదేవి సినిమాలో ప్రధాన పాత్ర ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. అనంతరం జిల్లాధికారికి వినతిపత్రాన్ని సమర్పించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News